ఒకవైపు కృష్ణ పట్టుదల.. మరొకవైపు ముకుంద పంతం!
on Jan 18, 2023
'కృష్ణ ముకుంద మురారి' ఇప్పుడు స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ధారావాహిక. ఎంతో వీక్షకులను సంపాదించుకుంటున్న ఈ సీరియల్ ఎపిసోడ్-56 లో .. ముకుందతో కలిసి మురారి ఉన్న ఫోటోని తీసుకొని వెళ్ళిపోతుంది రేవతి. " ఏంటి ముకుందా ఇది?" అని మురారి అడుగుతాడు. "కనీసం ఫోటో చూసుకునే అదృష్టం కూడా లేకుండా చేసింది మీ అమ్మ" అని ముకుంద అంటుంది. "వద్దు ఇక చాలు. ఏం సమాధనం చెప్పాలో తెలియక నలిగిపోయాను. మా అమ్మకి డౌట్ వచ్చింది. ఒకదానితో ఒకటి ముడివేస్తూ పోతే ఏదో ఒకరోజు ఈ నిజం బద్దలవుతుంది" అని మురారి అంటాడు. " బ్రహ్మాండమేం బద్దలవ్వదు కదా.. తెలియనివ్వు. ఏ రోజుకైనా వాళ్ళకి తెలియాల్సిందేగా" అని ముకుంద అంటుంది. "ఇది ఎప్పటికీ బయటపడకూని నిజం. నువ్వు నేను ఒకప్పటి ప్రేమికులం అని తెలిస్తే కృష్ణ పరిస్థితి ఏంటి. ఈ ఇంట్లో నా పరిస్థితి ఏంటి. నీ స్థానం ఏంటి?" అని కృష్ణ ప్రశ్నిస్తాడు. ముకుంద మౌనంగా ఉంటుంది. "నీ పెళ్ళితోనే మన ప్రేమకు సమాధి కట్టాను. ఆ తర్వాత నా పెళ్ళితో ఆ సమాధిని పెకిలించివేశాను. నీకు చేతులు జోడించి అడుగుతున్నాను. దయచేసి ఆ విషయం మర్చిపోయి ప్రశాంతంగా ఉండు" అని మురారి చెప్తాడు. "ఎలా ప్రశాంతంగా ఉండాలి. నువ్వు నా ప్రేమకి అన్యాయం చేశావు. కానీ నేను నా ప్రేమని అనుక్షణం కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. వెళ్ళు ముందుంది మొసళ్ళ పండుగ" అని ముకుంద అంటుంది. ఆ తర్వాత మురారి అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి షాపింగ్ కి వెళ్తారు. అక్కడ కృష్ణ కోసం ఒక చీరని సెలెక్ట్ చేయమని మురారికి చెప్తుంది భవాని. అయితే కృష్ణ ఒక సారీ సెలెక్ట్ చేస్తాడు. అది చూసి మొదట కృష్ణ "ఇది నాకు నచ్చింది" అని అనగా, "నాకు ఇదే నచ్చింది" అని ముకుంద అంటుంది. అలా ఇద్దరూ ఒకే చీర కోసం గొడవ పెట్టుకుంటారు. అది చూసి భవానీ "ఆపండి మీ గోల. ఏంటి మీరిద్దరు.. చిన్నపిల్లలు చాక్లెట్ కోసం కొట్టుకున్నట్టు అలా గొడవపడుతున్నారు. అయితే ఇద్దరికి ఇదే నచ్చిందా" అని అడుగుతుంది. "అమ్మా కృష్ణా.. నువ్వు ఇంకొక చీర సెలెక్ట్ చేసుకోమ్మా" అని రేవతి అడుగుతుంది. "సారీ అత్తయ్య. ఒకసారి నా చేతికొచ్చాక వదిలిపెట్టడం నాకిష్ణం లేదు.. నాది పట్టుదల" అని కృష్ణ అంటుంది. "ఒకసారి నేను ఇష్టపడ్డాక అంత తేలిగ్గా వదిలేసుకుంటానా.. నాది పంతం" అని ముకుంద అంటుంది. ఒక చీర కోసం ఇద్దరు గొడవపడటం అక్కడే ఉన్న సేల్స్ గర్ల్ చూసి "ఒక్క నిమిషం మేడమ్. మీ ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంది" అంటూ సేమ్ ఉన్న మరొక చీరని తీసుకొచ్చి ఇస్తుంది. ఇద్దరూ చేరొక చీరని తీసుకుంటారు.
"మురారికి మంచి డ్రెస్ సెలెక్ట్ చేయమ్మా" అని కృష్ణకి చెప్తుంది రేవతి. "అలాగే అత్తయ్య" అని కృష్ణ మంచి డ్రెస్ వెతుకుతుంది. ముకుంద కూడా మురారి కోసం ఒక డ్రెస్ సెలెక్ట్ చేస్తుంది. ముకుంద సూట్ సెలెక్ట్ చేయగా, కృష్ణ పట్టుపంచ సెలెక్ట్ చేస్తుంది. భవానీ చూసి ముకుందని తిడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
